Friday, May 17, 2024

కాస్మొటిక్‌ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి మృతి..!!

spot_img

Silvina Luna : హీరోయిన్స్, మోడల్స్ ఇటీవల అందంగా కనిపించేందుకు కాస్మొటిక్‌ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఈ సర్జరీ అంత సులువైంది కాదు. అది బెడిసికొడితే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి.

ఇది కూడా చదవండి : TSPSC సెప్టెంబర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తాజాగా ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా(43) మరణించింది. అయితే సిల్వినా గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతోనూ బాధపడుతున్నది. ఇటీవలే కాస్మొటిక్‌ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళింది.

అయితే, దురదృష్టవశాత్తూ ఆ ప్లాస్టిక్ సర్జరీ వికటించింది. ఆ ప్రభావం తన కిడ్నీ సమస్యను రెట్టింపు చేసింది. ఆస్పత్రిలో చేరి కొన్నిరోజులపాటు ప్రాణాలతో పోరాడింది. చివరకు సిల్వినా ప్రాణాలు కోల్పోయింది.

Latest News

More Articles