Friday, May 17, 2024

ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం ముగిసినట్టే..ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు

spot_img

ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్టేనని పరిశీలకులు అంటున్నారు. కంపెనీలు, ఉద్యోగుల్లో వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఆఫీసుకు రావాలంటూ అల్టిమేటంలు జారీ చేశాయి. ఈ ఆదేశాలపై ఉద్యోగుల్లో విముఖత వ్యక్తం అవుతున్నా లేఆఫ్ భయాలు వెంటాడుతుండటంతో కంపెనీ ఆదేశాలు పాటించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఉత్పాదక, సృజనాత్మకత పెంచేందుకు ఆఫీసుల్లోంచే పనిచేయాలని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, సొంతూళ్లకు వెళ్లిపోయిన ఐటీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నగరాల బాట పడుతున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

ఇప్పటికే పలు చిన్న కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. పెద్ద కంపెనీల్లోనే హైబ్రీడ్ మోడల్ కొనసాగుతోంది. అయితే, ఆఫీసులకు వచ్చేందుకు ఉద్యోగులు ఇంకా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోంచి పనిచేసినా ఉత్పాదకత తగ్గని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నగరాల్లో కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు సగటున 2 నుంచి 3 గంటల సమయం పడుతుండటం అనేక మందిని ఆందోళనకు గురి చేస్తోంది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ నేత వికృత చేష్టలు.. కోరిక తీర్చాలంటూ వివాహితపై వేధింపులు

Latest News

More Articles