Friday, May 17, 2024

నేడు వన ప్రవేశం చేయనున్న సమ్మక్క, సారలమ్మ

spot_img

ఇవాళ్టి(శనివారం)తో మేడారం జాతర ముగియనుంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో పూజారులు వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది.

మహాజాతర చివరి అంకాని చేరుకొవడంతో భక్తులు భారీ సంఖ్యలో రానున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఇప్పటికే ములుగు జిల్లా మేడారం సమీపంలోని ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది. ఇవాళ జాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు  

Latest News

More Articles