Saturday, May 18, 2024

జైస్వాల్ వీరబాదుడు.. టీ20ల్లో రికార్డులు బద్దలు

spot_img

ఏషియన్ గేమ్స్‎లో భాగంగా భారత పురుషుల క్రికెట్‌ జట్టు నేపాల్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతోంది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే జైశ్వాల్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇది అతడికి తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం.

Read Also: జడ్జీ అయిన దర్జీ కుమార్తె.. ఆ ప్రాంతం నుంచి మొదటి న్యాయమూర్తిగా రికార్డు

అంతేకాకుండా.. జైస్వాల్ టీ20ల్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. కేవలం 21 సంవత్సరాల తొమ్మిది నెలల 13 రోజుల వయస్సులో ఈ ఘనతను అందుకున్నాడు. గతంలో శుభమన్ గిల్ 23 సంవత్సరాల 146 రోజులలో న్యూజిలాండ్‌పై సెంచరీ కొట్టిన రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు.

Latest News

More Articles