Saturday, May 4, 2024

జడ్జీ అయిన దర్జీ కుమార్తె.. తెలంగాణలోని ఆ ప్రాంతం నుంచి మొదటి న్యాయమూర్తిగా రికార్డు

spot_img

ఏదైనా కావాలని గట్టిగా అనుకొని ప్రయత్నిస్తే దొరకనిది ఏదీ లేదు. అందుకే పెద్దలు కష్టే ఫలి అన్నారు. ఆ విధంగా కష్టపడి.. అనుకున్నది సాధించింది ఓ యువతి. తండ్రి కోరికను తన కోరికగా భావించి.. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహించింది.

ఇల్లందుకు చెందిన ఇల్లుటూరి లక్ష్మయ్య, స్వరూప దంపతులకు ముగ్గురు కుమార్తెలు. దర్జీ పనిచేసి లక్ష్మయ్య కుటుంబాన్ని పోషించేవారు. అదే సమయంలో ఆయనకు సింగరేణి సంస్థలో బదిలీ ఫిల్లర్‌ కార్మికుడిగా ఉద్యోగం దొరికింది. దాంతో 20ఏళ్లపాటు గోదావరిఖనిలో పనిచేశారు. తర్వాత ఇల్లందు ఏరియాలో వంట కార్మికుడిగా నియమించడంతో తిరిగి స్వస్థలానికి చేరారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిన ఆయన వారు బాగా చదువుకోవాలని తపన పడేవారు. ఆయన దర్జీగా ఉన్న సమయంలో వారి ఇంటి పక్కనే ఓ కోర్టు ఉండేది. అక్కడికి వచ్చే న్యాయమూర్తులను చూసి తన కూతుర్లలో ఒకరిని లాయర్ చేయాలనుకున్నాడు. తండ్రి ఆలోచనకు తగ్గట్టుగానే ఆయన కూతురు హారిక చిన్నతనం నుంచీ చదువుల్లో ముందుండేది. తండ్రి ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె చదువంతా గోదావరిఖని, కొత్తగూడెంలో జరిగింది. ఆ తర్వాత బీఏ ఎల్‌ఎల్‌బీ కాకతీయ యూనివర్సిటీలో, ఎల్‌ఎల్‌ఎం ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసింది.

Read Also: ఆడపడచులకు శుభవార్త.. 250 డిజైన్లలో 1.02 కోట్ల బతుకమ్మ చీరలు..

అనంతరం 2022లో జేసీజే నోటిఫికేషన్‌ రావటంతో రాత్రీపగలూ శ్రమించి.. వేలమంది రాసిన ఆ పరీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హారిక న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వరంగల్‌ థర్డ్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితురాలై తండ్రి కోరిక నెరవేర్చింది. అయితే.. గిరిజన ప్రాంతమైన ఇల్లందు చరిత్రలో ఇప్పటివరకు న్యాయమూర్తిగా ఇక్కడివారెవరూ ఎంపిక కాలేదు. ఇల్లందు నుంచి మొదటి న్యాయమూర్తిగా హారిక ఈ ఘనత సాధించింది.

Latest News

More Articles