Saturday, May 18, 2024

ఆడపడచులకు శుభవార్త.. 250 డిజైన్లలో బతుకమ్మ చీరలు.. రేపటి నుంచే పంపిణీ

spot_img

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం కానుకగా అందిస్తున్న చీరలివి. నేతన్నలకు ఉపాధి కల్పించటంతోపాటు ఆడపడుచులకు పండుగకు చిరుకానుక అందించే ఉద్దేశ్యంతో 2017లో బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది.

అయితే ఈ ఏడాది బతుకమ్మ చీరలను బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధంచేశారు. జరీతోపాటు వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారుచేయించారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ వేడుకలు ప్రతీకగా నిలిచాయి. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు ఆడబిడ్డలందరూ కొత్త చీరలు ధరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల్లోని నేతన్నలతో వీటిని తయారు చేయిస్తున్నారు. బతుకమ్మ పండుగ సమీపిస్తుండటంతో ఈ నెల 4 నుంచి చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏటా సుమారు ఒక కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాది కూడా 1.02 కోట్ల చీరలను తయారుచేయించారు. రేషన్ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు.

కాగా.. గతంలో కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగులు, వెరైటీల్లో చీరలను టెక్స్‌టైల్‌ శాఖ తయారుచేయింది. జరీతోపాటు వివిధ రకాల కలర్‌ కాంబినేషన్‌తో 250డిజైన్లలో చీరలను తయారు చేయించినట్టు అధికారులు తెలిపారు. వివిధ రకాల ఆకర్షణీయ రంగులు, థ్రెడ్‌ బోర్డర్‌‎తో 100 శాతం పాలిస్టర్‌ ఫిలిమెంట్‌ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందని పేర్కొన్నారు.

Latest News

More Articles