Saturday, May 18, 2024

బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నగరవాసుల హర్షం

spot_img

బెంగళూరు నగరంలో ఇటీవల నీటి కొరతతో నగరవాసులు అల్లాడిపోయారు. ఇళ్లలో రోజువారీ అవసరాలు తీర్చుకొనేందుకు నీరు దొరక్క నానా కష్టాలు పడ్డారు. కొందరు ఏకంగా అపార్ట్ మెంట్లను ఖాళీ చేయగా మరికొందరు సమీపంలోని మాల్స్ కు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఉన్నట్టుండి నిన్న(శుక్రవారం) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు 6 నెలల తర్వాత బెంగళూరులో శుక్రవారం తొలిసారి వర్షం కురిసింది. దీంతో బెంగళూరువాసులు పట్టరాని సంతోషంలో మునిగితేలారు. భారీ ఎండలు, ఉష్ణోగ్రతల నుంచి ఊరట లభించిందని తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరికొందరు వర్షం నీటిని వృథా కానీయకుండా ఇంకుడు గుంతల్లోకి పంపుతున్నారు.

మరికొందరు మాత్రం వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో మున్సిపల్ అధికారుల తీరును తప్పుబడుతున్నారు. గత ఆరు నెలలుగా వర్షాలు లేకపోయినా డ్రైనేజీలు, నాలలను శుభ్రం చేయకుండా అధికారులు నిద్రపోయారంటూ విమర్శించారు. రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నీళ్లకోసం తహతహలాడిన బెంగళూరు వాసులు నడివేసవిలో భారీ వర్షం కురవడంతో వారు ఇప్పటి వరకు పడిన కష్టాలనుంచి రిలాక్స్ అయ్యారు.

ఇది కూడా చదవండి: రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నరు

Latest News

More Articles