Saturday, May 18, 2024

309 పరుగుల తేడాతో ఆసీస్ భారీ విజయం.. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి

spot_img

న్యూఢిల్లీ:  వన్డే వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదుచేసింది. నెదర్లాండ్స్‌తో ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా309 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ 399 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ను 90 కే పరిమితం చేసి 309 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌ రేసులో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో  పరుగులపరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. వన్డేలలో భారత జట్టు 317 పరుగుల తేడాతో  శ్రీలంకను ఓడించి ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది.

Also Read.. చైనీస్ ఫుడ్స్ రుచిని పెంచే ఈ తెల్ల ఉప్పు ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?

ఆసీస్‌ నిర్దేశించిన 400 పరుగుల ఛేదన ప్రారంభించిన నెదర్లాండ్స్‌ 28 పరుగులకే తొలి వికెట్‌  కోల్పోయింది.  మిచెల్‌ స్టార్క్‌ నెదర్లాండ్స్‌ పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత  విక్రమ్‌ జిత్‌ సింగ్‌ (25),  అకర్‌మన్‌ (10), బస్‌ డీ లీడ్‌ (4), సిబ్రండ్‌ (11) లు  అలా వచ్చి ఇలా వెళ్లారు. 62 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (12 నాటౌట్‌), తేజ నిడమనూరు (14)తో కొద్దిసేపు నిలిచారు. ఆసీస్‌ బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు తీయగా..  మార్ష్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్‌, హెజిల్‌వుడ్‌, కమిన్స్‌లకు తలా ఓ వికెట్‌ తీసుకున్నారు.

Latest News

More Articles