Saturday, May 4, 2024

సంగారెడ్డిలో చింత గెలుపు.. జగ్గారెడ్డి ఓటమి ఖాయం.. హరీష్ రావు ఫైరింగ్ కామెంట్స్

spot_img

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీకి చెందిన బీర్ల శివకుమార్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ గెలుపు ఖాయం అని అర్థమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పి ప్రజల్లోకి వస్తుంది. పక్కనే కర్ణాటక ఉంది. అక్కడి నుండి కొన్ని వందల మంది రైతులు వచ్చి కాంగ్రెస్ ను నమ్మొద్దు, మోస పోవద్దు అని దండం పెట్టీ పోతున్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే 3 గంటల కరెంటే అని బాధ పడుతున్నారు.

కేసీఆర్ కంటే ముందు ఎవరైనా రైతులకు డబ్బు ఇచ్చారా..? ఎన్నికల్లో గెలిచాక 10 వేలు చేశారు. 11 సార్లు రైతుబందు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు. మూడు గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా.. 24 గంటల కరెంట్ ఇచ్చే వాళ్ళు కావాలా? మీకు నిత్యం అందుబాటులో ఉండే చింతా ప్రభాకర్ ను మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. జగ్గా రెడ్డి, జానా రెడ్డి ఇలా ఎంతో మంది సీఎం అని కలలు కంటున్నారు. కుర్చీల కొట్లాట ఎక్కువ, ప్రజల ప్రయోజనం తక్కువ. కాంగ్రెస్ వస్తె కొట్లాటలు, కుట్రలు, కర్ఫ్యూ లు. అది వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ అని పడిపోతాయి. భూముల రేట్లు తగ్గుతాయి. పని తనం తప్ప, పగ తనం తెలియని సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నాను’ అని అన్నారు హరీష్ రావు.

Latest News

More Articles