Saturday, May 18, 2024

కోల్ కతా గ్రాండ్ విక్టరీ..ముంబై ఎలిమినేట్..!

spot_img

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కు ఫలితాల గురించి ఆలోచించాల్సి అవసరం లేకుండా పోయింది. ఫ్లే ఆఫ్స్ సమీకరణాల గురించి కసరత్తు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సీజన్లో ముంబై కథ ముగిసింది. పేలవ ప్రదర్శనతో తాజాగా ఎనిమిదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ముంబై పే ఆఫ్స్ కు దారులు మూసుకుపోయాయి. ఈ మ్యాచులో విజయం సాధించిన కోల్ కతా 12ఏళ్ల తర్వాత తొలిసారి ముంబైలో ఎమ్ ఐపై గెలవడం గమనార్హం.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మ్యాచును గొప్ప ఆరంభించినా ఆ తర్వాత పట్టుకోల్పోయి కోల్ కతాకు మ్యాచును ఇవ్వాల్సి వచ్చింది. 18.5ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతావారంతా విఫలమయ్యారు. స్టార్క్ కు తోడు వరుణ్ చక్రవర్తి, నరైన్, రసెల్ విజ్రుంభించడం వల్ల ముంబై బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా 19.5ఓవర్లలో 169 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. వెంకటేశ్ అయ్యర్ భారీ ఇన్నింగ్స్ తో ఆకట్టకున్నాడు. మనీశ్ పాండే బాగానే రాణించాడు. ఈ ఇద్దరు మినహా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఓపెనర్ పిల్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్,రింకూ సింగ్, అండ్రూ రస్సెల్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ కు చేరుకున్నారు. ముంబై బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా చెర్ 3, హార్థిక్ పాండ్య 2, పియూశ్ చావ్లా 1 వికెట్ దక్కించుకున్నారు.

ఇది కూడా చదవండి : మహిళలకు గుడ్ న్యూస్..బంగారం ధరలు తగ్గాయ్..!

Latest News

More Articles