Saturday, May 18, 2024

మహిళలకు గుడ్ న్యూస్..బంగారం ధరలు తగ్గాయ్..!

spot_img

మహిళలకు శుభవార్త. బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. గరిష్ట స్థాయిని తాకిన పుత్తడి ధర ఇప్పుడు నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తూ కొనుగోలు దారులకు ఊరట కలిగిస్తోంది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 24క్యారెట్ల 10 గ్రాములు పుత్తడి రూ. 540 పడిపోయి రూ. 71,730 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర తులం విలువ కూడా రూ. 500 దిగి వచ్చి రూ. 65,750ఉంది. గురువారం ముగింపుతో చూస్తే ఢిల్లీ స్పాట్ మార్కెట్లోనూ 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 350 తగ్గింది.

ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు నేల చూపులే చూశాయి. ఔన్సు 7 డాలర్లు దిగి 2,297 డాలర్లకు పరిమితమైంది. ద్రవ్యోల్బణ భయాల నడుమ గత అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు..వడ్డీరేట్లను తగ్గించేందుకు చాలా కాలమే తీసుకుంటుందున్న ఊహాగానాలు బంగారం మార్కెట్ ను కుదిపేశాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగాయి.

ఇది  కూడా చదవండి: ప్రయాణికుల కోసం మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ

Latest News

More Articles