Monday, May 13, 2024

నాకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయి.. డీజీపీ రవి గుప్తా

spot_img

సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆధ్వర్యంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‎లో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్క్ షాపులో OLX, OTT మోసాలు, బల్క్ SMSలతో మోసాలపై అవగాహన కల్పించారు. సోషియల్ మీడియా ఫ్రాడ్, మొబైల్‎లో మన డేటాను ఎలా రక్షించుకోవాలనే దానిపై నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ రవిగుప్త, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read Also: తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‎కు ఓటు వేయాలి

ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్త మాట్లాడుతూ.. తనకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయని తెలిపారు. ‘సైబర్ క్రిమినల్స్ నుంచి తప్పించుకోవడానికి రెండు బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నా. యూట్యూబ్‎లో వీడియోలకి లైక్స్ కొడితే డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆన్లైన్‎లో పేమెంట్స్ చేయాల్సి వస్తే.. నా మెయిన్ అకౌంట్ నుంచి సెకండ్ బ్యాంక్ అకౌంట్‎కి మనీ పంపి.. అప్పుడు సెకండ్ అకౌంట్ నుండి పేమెంట్ చేస్తాను. ఫోన్‎లో యాప్స్ ఇన్‎స్టాల్ చేసేటప్పుడు, పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అలర్ట్‎గా ఉండాలి. టెక్నాలజీ వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అమాయకులతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ బాధితులవుతున్నారు. కర్ణాటక డీజీపీ కూడా సైబర్ క్రైమ్ వలలో పడ్డారు. సైబర్ క్రిమినల్స్ అమాయకులను భయపెట్టి లూటీ చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.

కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సీపీ, హైదరాబాద్
సైబర్ క్రైమ్ అవేర్‎నెస్ ప్రోగ్రామ్స్ వల్ల సైబర్ క్రైమ్‎కి గురవ్వకుండా ఉంటారు. హైదరాబాద్ కమిషనరేట్‎లో ప్రతిరోజు 20కి పైగా సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని సైబర్ క్రైమ్ కేసులు రిపోర్ట్ అవ్వడం లేదు. ఈ మధ్య ఎక్కువగా సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి. మొబైల్‎లో సెక్యూరిటీ ఫీచర్స్ తెలుసుకోవాలి. సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన కొందరు జీవితకాలం కొలుకోలేకపోతున్నారు. సైబర్ క్రైమ్ అవెర్ నెస్ వల్ల 60 శాతం సైబర్ క్రైమ్ తగ్గే అవకాశం ఉంది.

సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ షికా గోయల్
సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదు. లోన్ యాప్ లింకులు, ఇతర లింకులను క్లిక్ చేయకూడదు లేకపోతే సైబర్ క్రైమ్‎కు బాధితులుగా మారుతారు. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటి బ్యూరో ఏడాది క్రితం ప్రారంభించాం. సైబర్ క్రైమ్ బాధితుల కోసం 1930 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. 870 మంది కానిస్టేబుళ్ళకు సైబర్ వారియర్స్‎గా శిక్షణ ఇస్తున్నాం.

Latest News

More Articles