Sunday, May 19, 2024

ఇంటికే అయోధ్య హనుమాన్ ప్రసాదం..ఎలాగంటే?

spot_img

హనుమాన్ భక్తులకు శుభవార్త. అయోధ్యలో ఉన్న హనుమాన్ గఢీ ఆలయ ప్రసాదం ఇక నుంచి నేరుగా భక్తుల ఇళ్లకే చేరనుంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరుగుతోంది. దీంతో చాలా మంది భక్తులకు హనుమాన్ గఢీ ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ తపాలశాఖ హనుమాన్ గఢీ ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా నేరుగా భక్తుల ఇంటికే పంపించే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి..డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయోధ్య ధామ్ -224123 చిరునామాతో ఈ మనీ ఆర్డర్ తీసుకోవాలి. భక్తుల చిరునామకు ఆర్డర్ చేయాలి. పిన్ కోడ్, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇలా ఆర్డర్ చేసిన తర్వాత స్పీడ్ పోస్టు ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపుతామని ప్రయాగ్ రాజ్, వారణాసి జోన్ పోస్టు మాస్టర్ క్రుష్ణ కుమార్ తెలిపారు. రూ. 251 మనీ ఆర్డర్ కు లడ్డూలు, హనుమాన్ ఫొటో, మహావీర్ గంధం, అయోధ్య దర్శన పుస్తకం పంపిస్తారు.

ఇది కూడా చదవండి: దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ పండ్లు తింటే ఎంతో మేలు.!

Latest News

More Articles