Saturday, May 18, 2024

వ‌ర్ణం షాపింగ్‌మాల్ కూల్చివేసిన బ‌ల్దియా

spot_img

అక్ర‌మ నిర్మాణాల‌పై బ‌ల్దియా అధికారులు కొర‌డా ఝలుపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ లోని వరంగల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన‌ వర్ణం షాపింగ్ మాల్ బిల్డింగ్ ను బల్దియా అధికారులు ఇవాళ(మంగళవారం) తెల్ల‌వారు జామున తొల‌గించారు.

ఇప్పటి వరకూ అకుపెన్సి సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్య కలాపాలు నిర్వహిస్తూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేశారు. నిబంధనలకు విరుద్ధమైన భవనాలు ఉంటే తీసేయాలంటూ సిటీ ప్లానర్ బానోతు వెంకన్న ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చి వేసే వరకు వేచి చూడొద్దని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఏ ఒక్కరిని ఉపేక్షించ‌బోమ‌న్నారు. పలు షాపింగ్ మాల్స్ లలో స్టిల్ట్ కొరకు నిర్మించిన దానిలో పార్కింగ్ కు కాకుండా నిర్మాణాలు ఉన్నట్లైతే వెంటనే తొలగించుకోవాలని సూచించారు. తమ బృందం వచ్చి కూల్చే అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:రవిశాస్త్రి,శుభ్ మన్ గిల్ కు బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డులు..!!

Latest News

More Articles