Saturday, May 4, 2024

చైనాలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం

spot_img

చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం  వచ్చింది. నిన్న(సోమవారం) అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్‌యాంగ్  ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్‌-జిన్‌జియాంగ్‌ సరిహద్దుల్లో పలువురు గాయపడ్డారు. ఇండ్లు కూడా కూలిపోయాయని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిన్‌జియాంగ్ పరిధిలో 27 రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసింది. భూప్రకంపనలు సంభవించిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఆగని కాల్పులు..చికాగోలో ఓ దుండగుడి కాల్పుల్లో 8మంది మృతి..!!

Latest News

More Articles