Saturday, May 18, 2024

కునో నేషనల్ పార్కులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన జ్వాల..!!

spot_img

నమీబియా చిరుత జ్వాల.. కునో నేషనల్ పార్క్‌లో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అంతకుముందు జనవరి 3న ఆడ చిరుత ఆశా మూడు పిల్లలకు జన్మనిస్తే, ఇప్పుడు జ్వాల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు కునో నేషనల్ పార్క్‌లో 6 కొత్త చిరుతలు వచ్చాయి. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ట్వీట్ చేవారు. దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ముందు వరుస యోధులు, వన్యప్రాణుల ప్రేమికులందరికీ అభినందనలు. భారతదేశంలో వన్యప్రాణులు ఈ విధంగా అభివృద్ధి చెందుతాయి.అంటూ వీడియోను షేర్ చేశారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఆగని కాల్పులు..చికాగోలో ఓ దుండగుడి కాల్పుల్లో 8మంది మృతి..!!

గత సంవత్సరం కూడా మార్చి 27, 2022న, జ్వాల నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వాటిలో మూడు చనిపోయాయి. ఒక ఆడ పిల్ల ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. దాని వయస్సు 10 నెలలు. దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి రెండు దశల్లో మొత్తం 20 చిరుతపులిలను కునోకు తీసుకురాగా, అందులో ఏడు చిరుతపులులు చనిపోవడం గమనార్హం. ఇప్పుడు కునోలోని పిల్లల సంఖ్య ఏడుకి పెరిగింది. ఇది 17 సెప్టెంబర్ 2022న ప్రధాని మోదీ ప్రారంభించిన చిరుత ప్రాజెక్టులో గత ఏడాదిన్నర కాలంలో సాధించిన పెద్ద విజయం.

Latest News

More Articles