Saturday, May 18, 2024

అక్టోబర్‌లో 16రోజులపాటు బ్యాంకులకు సెలవులు

spot_img

న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో పలు పండుగలు వస్తుండటంతో బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఆయా రోజుల్లో బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోతాయి. ఆదివారంతో ప్రారంభం అవుతున్న అక్టోబర్ లో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సాధారణ వారాంతపు సెలవులు. మొత్తంగా ఏడు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు. రీజినల్ హాలిడేస్ కలుపుకుంటే మొత్తంగా బ్యాంకులు 16 రోజులు పనిచేయవు.

Also Read.. ఒకే ఏడాది రెండు సినిమాలతో రెండుసార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లోకి షారుఖ్‌ఖాన్‌

  • 1 అక్టోబర్ – ఆదివారం – వారాంతపు సెలవు
  • 2 అక్టోబర్ – సోమవారం – మహత్మాగాంధీ జయంతి
  • 8 అక్టోబర్ – ఆదివారం – వారాంతపు సెలవు
  • 14 అక్టోబర్ – రెండో శనివారం – మహాలయ అమావాస్య (దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు) – కోల్‌కతాలో సెలవు.
  • 15 అక్టోబర్ – ఆదివారం- వారాంతపు సెలవు
  • 18 అక్టోబర్ – బుధవారం – కటిబిహూ – గువాహటిలో సెలవు
  • 21 అక్టోబర్ – శనివారం – దుర్గాపూజ – అగర్తల, గువాహటి, ఇంఫాల్, కోల్‌కతా నగరాల పరిధిలో సెలవు.
  • 22 అక్టోబర్ – ఆదివారం – వారాంతపు సెలవు
  • 23 అక్టోబర్ – సోమవారం – దుర్గా పూజ – అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, కొచి, కోహిమ, కోల్‌కతా, లక్నో, పాట్నా నగరాల పరిధిలో సెలవు
  • 24 అక్టోబర్ – మంగళవారం – దుర్గా పూజ (విజయదశమి) – దేశమంతటా సెలవు
  • 25 అక్టోబర్ – బుధవారం – దుర్గాపూజ-గ్యాంగ్‌టక్‌లో సెలవు
  • 26 అక్టోబర్ – గురువారం – దుర్గా పూజ – గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్‌లలో సెలవు
  • 27 అక్టోబర్ – శుక్రవారం – దుర్గా పూజ – గ్యాంగ్‌టక్‌లో సెలవు
  • 28 అక్టోబర్ – శనివారం – లక్ష్మీ పూజ – కోల్‌కతాలో సెలవు
  • 29 అక్టోబర్ – ఆదివారం – వారాంతపు సెలవు
  • 31 అక్టోబర్ – బుధవారం – సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి – అహ్మదాబాద్‌లో సెలవు

Latest News

More Articles