Friday, May 17, 2024

కేసీఆర్‌ పాలనపై భీమవరం MLA ప్రశంసలు

spot_img

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాలనపై భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, పరిపాలనపై MLA గ్రంధి శ్రీనివాస్ స్పందిస్తూ.. భీమవరంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఆంధ్రాలో అధికారంలోకి రావడం ఆనవాయితీగా ఉందని తెలిపారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ జిల్లాలు విభజన చేసి.. మంచి పరిపాలన చేశారని కొనియాడారు. తెలంగాణకు పరిపాలనా వికేంద్రీకరణ ఫలితాలను అందించారని అన్నారు.

అయితే అప్పుడు చంద్రబాబుకు మాత్రం ఎలాంటి ఆలోచనా లేకుండా అమరావతి పేరుతో గ్రాఫిక్స్ తో ప్రజలను మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. ఇక జనసేన పార్టీ పెట్టినప్పుడు చేగువేరాతో పాటు మహనీయుల ఫోటో పెట్టుకున్న పవన్ ఇపుడు అవి తీసేసి.. చంద్ర బాబు ఫోటో పెట్టుకున్నారని చురకలు అంటించారు. చంద్ర బాబులో పవన్ కి చేగువేరా కనిపిస్తున్నాడు.. యువత పవన్ ఏం చేస్తున్నాడో ఆలోచించాలని కోరారు.

Latest News

More Articles