Sunday, May 19, 2024

సీఎంని మించిన క్రేజ్.. కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్న కేసీఆర్ ఎంట్రీ

spot_img

రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో.. తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరగటంతో ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రమాణం చేయలేకపోయారు. అయితే నేడు శాసనసభ్య వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్, హరీష్ రావు, తలసానిలతో పాటు భారీ బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలో కేసీఆర్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు.

కేసీఆర్ ప్రమాణం చేయగానే స్పీకర్ ఛాంబర్ లో హర్షాతిరేకాలు వెలువడ్డాయి. కరతాళధ్వనులతో కేసీఆర్ కి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబులు అభినందించారు. ఆ తరువాత ప్రతిపక్షనేత ఛాంబర్ లో కేసీఆర్ కాసేపు కూర్చున్నాడు. అక్కడ భారీగా బీఆర్ఎస్ నాయకులు ఆయనకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. అయితే కేసీఆర్ వచ్చే ఒక గంట ముందు నుండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే ఉత్యాహం, కోలాహలమే ఇప్పుడూ కనిపించిది. కేసీఆర్ క్రేజ్ చెక్కుచెదరనిది అని చెప్పడానికి ఈ సంఘటనే ఉదహరణ అంటున్నారు. ఇక తదుపరి బడ్జెట్ సెషన్‌లో ఆయన బీఆర్‌ఎస్‌ఎల్‌పీకి నాయకత్వం వహించనున్నారు కేసీఆర్.

Latest News

More Articles