Sunday, June 30, 2024

అమిత్‌ షాపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ బీహార్‌ సీఎం..!!

spot_img

పట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీరుపై బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ మండిపడ్డారు. ఆయన అడ్డగోలుగా నోటికొచ్చింది మాట్లాడుతాడని, ఆయన మాటలను తాను పట్టించుకోనని విరుచుకుపడ్డారు. శనివారం బీహార్‌లో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్‌ షా ప్రసంగంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా.. నితీశ్‌ కుమార్‌ స్పందించారు.

Also Read.. మరో అంతర్జాతీయ సంస్థకు సీఈఓగా భారతీయుడు

‘అమిత్ షాతోపాటు బీజేపోళ్లను పట్టిచుకోను.  నేను వాళ్లకు (బీజేపీ నేతలకు) సంబంధించిన ఏ విషయాన్ని పట్టించుకోను. అమిత్‌ షా బిహార్ ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతాడు. నోటికొచ్చిన ఆరోపణలు చేసి పోతడు. బీహార్‌ అభివృద్ధిపై ఆయనకు కొంచమైన అవగాహన ఉందా?.  ఇక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా..?’’ అని నితీశ్‌ ప్రశ్నించారు.

Latest News

More Articles