Friday, May 17, 2024

ఇంట్లోంచే ‘గయ’లో పిండ ప్రదానం చేయొచ్చు..!

spot_img

భారత్‌లో పురాతనకాలం నుంచి పిండ ప్రదానం అనేది హిందూ సమాజంలో అనాదిగా వస్తున్న ఆచారం. చనిపోయిన తల్లిదండ్రులతో పాటు పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం ఆనవాయితీ. దాంతో చనిపోయిన వారి ఆత్మ మోక్షం పొందుతుందని పండితులు చెబుతుంటారు.

అయితే, పిండ ప్రదానాలకు పలు క్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి. అక్కడ పిండ ప్రదానం చేస్తే.. పూర్వీకుల ఆత్మ మోక్షం పొందుతుందని నమ్మకం ఉంది. దేశవ్యాప్తంగా పిండ ప్రదానం చేయడానికి 55 పుణ్యక్షేత్రాలున్నాయి. ఇందులో బిహారలోని గయ ప్రముఖమైంది.

ఇది కూడా చదవండి: తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌ జారీ..!

గయలో పిండ ప్రదానం చేస్తే మోక్షం పొందుతారని విశ్వాసం ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం.. శ్రీరాముడు గయలోనే తన తండ్రి దశరథుడికి పిండ ప్రదానం చేశాడని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో గయకు రాలేని వారి కోసం బిహార్‌ ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తున్నది.

ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో పిండ ప్రదానం చేసే అవకాశం కల్పిస్తున్నది. కోసం రూ.23వేలు చెల్లించి ఈ-పిండ ప్రదాన్‌ ద్వారా పూర్వీకులకు పిండ ప్రదానం చేయవచ్చని టూరిజం పేర్కొంది. ఆ తర్వాత గయ పూజారులు విష్ణుపాద్‌ ఆలయం, అక్షయవత్‌, ఫల్గునది వద్ద పిండ ప్రదానం చేస్తారని తెలిపింది.

ఇది కూడా చదవండి: డిగ్రీ సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్‌ను ముద్రించకూడదు… యూజీసి ఆదేశం..!!

అన్ని క్రతువులు అన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. రికార్డింగ్‌ చేసి.. పెన్‌డ్రైవ్‌లో అందజేస్తారు. ఈ సారి పితృపక్షాలు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 14 వరకు జరుగనున్నాయి. దీంతో దేశ విదేశాల నుంచి గయకు పర్యాటకులు తరలివస్తారు. ఈ క్రమంలో బిహార్‌ స్టేట్‌ టూరిజం కార్పొరేషన్‌ పలు ప్యాకేజీలను ప్రకటించింది.

Latest News

More Articles