Wednesday, May 1, 2024

తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌ జారీ..!

spot_img

హైదరాబాద్: తెలంగాణకు  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలుజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇది కూడా చదవండి:  రజిని అభిమానులకు అదిరిపోయే వార్త.. ఓటీటీలోకి ‘జైలర్’..!!

నిన్న ఈశాన్య  బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టంకి 4.5 కిమీ ఎత్తు వరకు కేంద్రీకృతమై వున్న ఆవర్తనము ఈరోజూ అదే ప్రాంతంలో కొనసాగుతూ  వున్నది. ఈ ఆవర్తనము నుండి దక్షిణ ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టంకి 3.1 కిమీ ఎత్తు లో విస్తరించి వున్న ద్రోణి ఈరోజు బలహీన పడింది. నిన్న అంతర్గత కర్ణాటక నుండి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి వున్న ద్రోణి ఈరోజు విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగుతూ సముద్ర మట్టంకి 0.9 కిమీ ఎత్తు వరకు కేంద్రీకృతమై వున్నది.

ఇది కూడా చదవండి:  డిపాజిట్లు కూడా దక్కవని ప్రతిపక్షాలకు భయం పట్టుకుంది..!!

మరోక ఆవర్తనము  ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 3వ తేదీన ఏర్పడే అవకాశం ఉన్నది. దీని ప్రభావం వల్ల రాబోయె తడుపరి 48 గంటల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం వుంది. దీంతో ఈరోజు  రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, రేపు  భారీ వర్షాలు, ఎల్లుండి భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Latest News

More Articles