Monday, May 20, 2024

జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కంపెనీల బాగోతాలు బయటపెడతాం

spot_img

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పందించారు. ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడిన ఆయన.. సమీకరణాల మేరకు కొంతమంది పార్టీలు మారుతున్నారని చెప్పారు. అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత జితేందర్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. తన కుమారుడికి సీటు ఇస్తే సిద్ధాంతం ఉంటుంది… సీటు ఇవ్వకపోతే ఉండదా? అని ప్రశ్నించారు.

జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కంపెనీల బాగోతాలు బయటపెడతామని హెచ్చరించారు. వీరిద్దరు పార్టీ మారడం వెనుక ఆర్థిక లబ్ధి ఉందని ఆరోపించారు. పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అ డబ్బుతో కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ ఇవ్వబోతున్నారని ఆరోపించారు. ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు? అని ప్రశ్నించారు. తమకు అన్నీ తెలుసునని… తమ దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు రఘునందన్ రావు.

ఇది కూడా చదవండి: చేవేళ్ల ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ ను రంజిత్ రెడ్డి 100 కోట్లకు కొన్నారు

Latest News

More Articles