Monday, May 20, 2024

చేవేళ్ల ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ ను రంజిత్ రెడ్డి 100 కోట్లకు కొన్నారు

spot_img

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరడం నయవంచన,దగా,వెన్నుపోటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయ‌కుడు ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి. రంజిత్ రెడ్డికి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే తొలిసారి ఎంపీ అయ్యారన్నారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి.. రంజిత్ రెడ్డి అన్ని విధాలా ఎదగడానికి బీఆర్ ఏస్సే కారణం. ఐదేండ్ల కింద‌ట మా ప్రాంతానికే కాదు.. రాష్ట్రానికి ఆయ‌న ఎవ‌రో తెలియ‌ని వ్య‌క్తి. ఆయ‌న క‌రీంన‌గ‌ర్ వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ.. పార్టీకి అండ‌గా ఉన్నాడ‌ని చెప్పి, కేసీఆర్ చేవెళ్ల‌లో అవ‌కాశం ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాం. మా ప్రాంతం వ్య‌క్తి కాక‌పోయినా కూడా మా ప్రాంతం ఆయ‌న‌ను గౌర‌వించింది. నాయ‌క‌త్వం కూడా గౌర‌వించిందన్నారు.

కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరమవుతారా ? అని ప్రశ్నించారు కార్తీక్ రెడ్డి. కష్టకాలం లో రంజిత్ రెడ్డి కేసీఆర్ కు అండగా ఉండాలి… కానీ వెన్నుపోటు పొడుస్తారా ?. చేవేళ్ల ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ ను రంజిత్ రెడ్డి వంద కోట్ల రూపాయలకు కొన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జెండా మోసిన తమకు అన్యాయం చేసి రంజిత్ రెడ్డి కి టికెట్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. తనకు మరోసారి ఎంపీ గా పోటీ చేసే ఉద్దేశం లేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని రంజిత్ రెడ్డి చెబితే కేసీఆర్ నమ్మారు. కేసీఆర్ నమ్మకాన్ని రంజిత్ రెడ్డి వమ్ముచేశారన్నారు. డ‌బ్బు మూట‌ల‌తో పార్టీ టికెట్లు, కార్య‌క‌ర్త‌ల‌ను మీ వెంట తిప్పుకోవ‌చ్చు. డ‌బ్బు మూట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను కొన‌లేరు, ఓట్ల‌ను కొన‌లేరన్నారు. రంజిత్ రెడ్డి కి ఈ సారి ఓటమి ఖాయమన్నారు. చేవెళ్లలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.

ఇది కూడా చదవండి: దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేయండి

Latest News

More Articles