Monday, May 20, 2024

వైరలవుతున్న వీడియో: నడిరోడ్డు మీద జుట్టుపట్టుకొని కొట్టుకున్న..

spot_img

క్రమశిక్షణకు మారుపేరు అని గొప్పలు చెప్పుకును బీజేపీ కార్యకర్తలు బరితెగించారు. రోడ్డుపై ఒకరినొకరు చితకబాదుకున్నారు. ఈ గొడవకు పాల్పడింది మహిళా కార్యకర్తలు కావడం గమనార్హం. ఈ ఘటన బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‎లో బుధవారం జరిగింది. జలౌన్‌ జిల్లాలోని కల్పి నగర్‌, రామ్ వాటికలో నారీ శక్తి బంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భాను ప్రతాప్ వర్మ, యుపి ప్రభుత్వ మంత్రి అర్చన పాండే, జిల్లా అధ్యక్షురాలు ఉర్విజా దీక్షిత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ల మీద ప్రసంగం ఉండటంతో స్థానిక బీజేపీ మహిళా మోర్చా నాయకులు, మహిళా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Read Also: నేడు బంగ్లా వర్సెస్ ఇండియా.. రీసెంట్‎గా ఆ టీంతో ఆడిన 4 మ్యాచుల్లో 3 ఓడిన భారత్

అయితే కార్యక్రమం మొదలైన కాసేపటికి ఏదో విషయంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు సభా ప్రాంగణం బయట వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో రోడ్డు మీదకు వచ్చి.. జుట్లు పట్టుకొని ఎడాపెడా కొట్టుకున్నారు. అక్కడ ఉన్న పురుషులు కూడా గొడవలోకి దూరి.. కొంతమంది మహిళా కార్యకర్తలను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. యోగి పాలన ఎంత అధ్వానంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష పార్టీలైన సమాజ్ వాదీ, కాంగ్రెస్‌, బీఎస్పీ మండిపడుతున్నాయి.

Latest News

More Articles