Friday, May 17, 2024

నేడు బంగ్లా వర్సెస్ ఇండియా.. రీసెంట్‎గా ఆ టీంతో ఆడిన 4 మ్యాచుల్లో 3 ఓడిన భారత్

spot_img

వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న టీమ్‌ఇండియా గురువారం పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అన్ని రకాలుగా బంగ్లాదేశ్‌ కన్నా రోహిత్‌ సేన ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నా.. రీసెంట్‎గా జరిగిన ఆసియా కప్ మ్యాచుల్లో మాత్రం బంగ్లా చేతిలో ఓటమి పాలైంది. బంగ్లా జట్టు ఎంత బలంగా తయారైందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై అఫ్గానిస్థాన్‌.. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ గెలిచి రికార్డ్ సృష్టించాయి. ఆ జట్లను స్ఫూర్తిగా తీసుకొని బంగ్లా కూడా భారత్‌ను నిలువరించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది.

కాగా.. ఇప్పటికే వరల్డ్ కప్‎లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి ఊపు మీదున్న రోహిత్ సేన.. ఈ మ్యాచులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ చేరాలని భావిస్తోంది. తొలి మ్యాచులో ఆస్ట్రేలియాను ఓడించిన రోహిత్‌ సేన ఆ తర్వాత వరుసగా అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌‎లను మట్టికరిపించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అలవోక విజయాలు సొంతం చేసుకున్న రోహిత్‌ సేన నేడు బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల బంగ్లాతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన భారత్‌.. మరి ఈ సారి ఏం చేస్తుందో చూడాలి. కాగా.. పుణె పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలెక్కువ. ఇక్కడ జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింట తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు మూడొందల పైచిలుకు స్కోర్లు చేయడం గమనార్హం.

Latest News

More Articles