Friday, May 3, 2024

బీఆర్ఎస్‎లో చేరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్.. తమ అభ్యర్థుల్ని ప్రకటించి.. రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కూడా తన ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గాల వారీగా తిరుగుతూ.. క్యాడర్‎లో జోష్ పెంచుతున్నారు. ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చాలామంది అధికార పార్టీలో చేరుతున్నారు.

తాజాగా సిరిసిల్లలో బీజేపీకి షాక్‌ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్‌రావు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆవునూరి రమాకాంత్‌రావు మాట్లాడుతూ.. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

Read Also: గుజరాత్‎లో కుప్పకూలిన బ్రిడ్జి.. నలిగిపోయిన ఆటో డ్రైవర్, ప్యాసింజర్

అంతకుముందు సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవునూరి రమాకాంత్‌రావు మాట్లాడారు. ‘తెలంగాణ బీజేపీలో జరుగుతున్న నియంత పోకడకు నిరసనగా బీజేపీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్య పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆవునూరి రమాకాంత్ రావు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు చేసిన త్యాగాలను గుర్తించకుండా, స్థానిక కార్యకర్తలతో సంప్రదించకుండా ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమ రెడ్డిని సిరిసిల్ల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పైకి కనపడే భారతీయ జనతా పార్టీ వేరు.. అంతర్గతంగా భారతీయ జనతా పార్టీలో జరిగే పరిణామాలు వేరని ఆయన స్పష్టం చేశారు. రమాకాంత్ తన రాజీనామ లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.

‘సిద్ధాంతాలు గల పార్టీగా, నిబద్ధత కలిగిన నాయకులుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని భావించాను. ఈ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చని ఒక మంచి ఉద్దేశంతో బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరాను. పార్టీలో చేరిన మొదటి రోజు నుండి నా యొక్క చెమట చుక్కలు పెట్టుబడిగా పెట్టి, ప్రాణాతి ప్రాణంగా భావించే 25 సంవత్సరాల నా వృత్తిని కూడా వదులుకొని, కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నిబద్ధత కలిగిన నాయకునిగా పార్టీ ఎదుగుదలకు ఎంతో పోరాటం చేశాను. కానీ రాజకీయాలలో నమ్మకమే ప్రధాన పెట్టుబడి అని బలంగా నమ్మే వ్యక్తిని నేను, అందుకే బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మి కష్టపడడం జరిగింది.

Read Also: పొగమంచుతో ఒకదానితో ఒకటి ఢీకొన్న 150 వాహనాలు.. ఏడుగురు మృతి

కానీ, నా నమ్మకాన్ని వమ్ముచేస్తూ.. కష్టపడ్డ వ్యక్తుల యొక్క కష్టాన్ని గుర్తించకపోగా, నియంతృత్వ పోకడలతో, ఒంటెద్దు నిర్ణయాలతో మా యొక్క మనోభావాలను గౌరవించకుండా ఈ ప్రాంత సమస్యల మీద అవగాహన లేని, ఈ ప్రాంత ఉద్యమం మీద పట్టు లేని ఒక పసలేని వ్యక్తిని తీసుకువచ్చి మా మీద బలవంతంగా రుద్దడం అనేది సిగ్గుచేటైన విషయం. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఎంతోమంది జాతీయ, రాష్ట్ర నాయకులు బీజేపీలోకి రావడం జరిగింది, కానీ బీజేపీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఇమడలేక వెనుదిరిగిన నాయకులు ఎందరో.. అందుకు డాక్టర్ దాసోజు శ్రవణ్ సంఘటనే నిదర్శనం.

ఈ సందర్భంగా కింది స్థాయి కార్యకర్తలు బీజేపీ పార్టీపై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకండని విన్నవిస్తూ, నా మీద నమ్మకంతో ఇంతకాలం నావెన్నంటి ఉన్న కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరునా ధన్యవాదాలు’ రమాకాంత్ తన లేఖలో పేర్కొన్నారు.

Latest News

More Articles