Saturday, May 11, 2024

మహిళా బిల్లు లోపభూయిష్టంగా ఉంది

spot_img

కరీంనగర్‌: ప్రస్తుతం కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు లోపభూయిష్టంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. మహిళా బిల్లు అంశంపై కరీంనగర్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలన్న సంకల్పంతో, చిత్తశుద్ధితో  పెట్టినట్లుగా కనిపించడం లేదని అన్నారు.

Also Read.. ఏపీకి షాక్.. తెలంగాణ ఘన విజయం

లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు క్లాస్‌-5 ప్రకారం చూస్తే.. జనాభా లెక్కలు జరిగిన తదుపరి మాత్రమే డీలిమిటేషన్‌ జరుగుతుందని, దాని తర్వాత మాత్రమే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని కేంద్రం చెపుతుందన్నారు. నిజానికి 2020-21లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా వల్ల వాయిదా పడ్డాయని, వచ్చేజనాభా లెక్కలు 2030-31లో జరిగే అవకాశం ఉందన్నారు.

Also Read.. రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

మోడీ సర్కార్ తీరును చూస్తుంటే.. 2039లో మహిళా బిల్లు అమలుకు నోచుకునే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుందన్నారు.  నిజంగా మోడీకి చిత్త శుద్ది ఉంటే.. ప్రస్తుతం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును సవరించడానికి మరో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సరైన స్పష్టత, అవగాహన లేకుండా బిల్లు పాస్‌ చేస్తే భవిష్యత్‌లో అనేక అవాంతరాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Latest News

More Articles