Sunday, April 28, 2024

రాష్టానికో మ్యానిఫెస్టోనా.. కాంగ్రెస్ పై మంత్రి సబిత సెటైర్లు

spot_img

రంగారెడ్డి జిల్లా: రూ.100 కోట్లతో జల్ పల్లి మునిసిపాలిటీ లో  అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రూ.25 కోట్లకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రీమియర్ ఫంక్షన్ హల్ లో 313 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను, 80 మంది వికలాంగులకు బ్యాటరీ వాహనాలు,180 మంది మహిళలకు కుట్టు మిషన్లను హోం మంత్రి మహమూద్ అలీ తో కలిసి పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి.. మ‌హిళ‌లు పారిశ్రామికంగా ఎద‌గాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు లాంటి కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పహాడి షరీఫ్ లోగల దర్గా ర్యాంప్ రోడ్డు పనులకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. మొత్తం రూ.14 కోట్ల నిధులతో దర్గా పైకి రోడ్డు,పార్కింగ్ వసతులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ షాది ముబారక్,కళ్యాణాలక్ష్మి పథకాల ద్వారా సహాయం అందిస్తూ పేద అడబిడ్డల పెళ్లిళ్లకు  అండగా నిలుస్తున్నారన్నారు. 5 ఏళ్లలో  61 కోట్ల రూపాయలు మహేశ్వరం నియోజకవర్గములో అందించటం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి… అమెరికాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచుల వేదికలు ఇవే

ముఖ్యమంత్రి వికలాంగుల పెన్షన్ రూ.4 వేలకు పెంచి అండగా నిలిచారన్నారు. నేడు బ్యాటరీ వాహనాలు అందిస్తున్నాం అన్నారు. పనిచేసే వారిని గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వెంటే నడవాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారని తెలిపారు. జాతీయ పార్టీలుగా చెప్పుకొనే వారు రాష్టానికి ఒక మ్యానిఫెస్టో పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వారు పాలిస్తున్న రాష్టాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Latest News

More Articles