Saturday, May 4, 2024

మ‌హిళ‌లు పారిశ్రామికంగా ఎద‌గాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

spot_img

తొర్రూరు: మ‌హిళ‌లు పారిశ్రామికంగా ఎద‌గాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యమని, మ‌హిళ‌లు బాగుప‌డితేనే దేశం, రాష్ట్రం, కుటుంబం, స‌మాజం బాగుప‌డుతుందని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. కుట్టు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న పెద్ద‌వంగ‌ర‌, తొర్రూరు, రాయ‌ప‌ర్తి మండ‌లాల మ‌హిళ‌ల‌కు తొర్రూరులో స‌ర్టిఫికేట్లు, కుట్టు మిష‌న్లు పంపిణీ చేసిన మంత్రి, మ‌హిళ‌లనుద్దేశించి మాట్లాడారు.

Also Read.. గిరిజన వ్యక్తిని చెప్పుతో కొట్టిన బీజేపీ నేత

మహిళలు సైనికుల్లా తయారు అవ్వాలని, మీకు సాయంగా నిలిచిన కెసిఆర్ కు, తనకు మీరంతా అండ‌గా నిల‌వాలని కోరారు. మహిళలు ఆర్థికంగా బ‌ల‌ప‌డి, బాగు పడితేనే కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగు పడుతుందన్నారు. 5 కోట్ల 10 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని పాలకుర్తిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన. మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వటం తన లక్ష్యం అన్నారు.  శిక్షణ పూర్తి అయిన వాళ్లకు ఈ జూలై నుండి వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ఈ మేర‌కు ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ మెగా టెక్స్‌టైల్ పార్క్ కు చెందిన పారిశ్రామిక‌వేత్త‌ల‌తో మాట్లాడినట్లు తెలిపారు.

Latest News

More Articles