Saturday, May 18, 2024

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు భారత పౌరసత్వం

spot_img

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ఇవాళ (మంగళవారం) ట్విటర్‌ వేదికగా తెలిపాడు.‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ హిందుస్థానీ. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’అని చెప్పాడు. తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్‌ గతంలో చెప్పారు.

1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా… వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహాతో అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే పాస్‌పోర్ట్‌కు అప్లయ్‌ చేశా. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్‌ వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో మళ్లీ కెనడాకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా అని చెప్పారు. తాజాగా త‌న‌కు భార‌త్ పౌర‌స‌త్వం ల‌భించ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశాడు.

Latest News

More Articles