Friday, May 17, 2024

ధరణి సేవలకు బ్రేక్..? రిజిస్ట్రేషన్లు మినహా అన్ని సేవలు బంద్..!!

spot_img

రాష్ట్రంలో ధరణి పోర్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రిజిస్ట్రేషన్లు మినహా ఇతర సేవలన్నీ కూడా ఆపివేయాలంటూ రెవెన్యూ శాఖ నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువస్తామని సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి ఈ మధ్యే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ధరణి పనితీరు, పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న విషయంపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. 10రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇక ధరణి ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు సులువుగా జరుగుతున్న విధానాన్ని సీఎం అభినందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త పోర్టల్ తీసుకురావాలా లేదా ధరణిలోనే మార్పులు చేర్పులు చేసి పేరు మార్చాలా అనే అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక పోతుందని తెలుస్తోంది. భూ సంబంధ సమస్యలు, పరిష్కారంపై స్పష్టత వచ్చేంత వరకు ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు నాలా కన్వర్షన్లు మినహా ఇతర సేవలన్నింటిని నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కొత్త 9కోవిడ్ కేసులు..2 నెలల చిన్నారికి పాజిటివ్.!!

Latest News

More Articles