Thursday, May 2, 2024

తెలంగాణలో కొత్త 9కోవిడ్ కేసులు..2 నెలల చిన్నారికి పాజిటివ్.!!

spot_img

తెలంగాణలో కోవిడ్ కేసులు మరోసారి భారీగా నమోదు అవుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2 నెలల చిన్నారికి కూడా పాజిటివ్ రావడం గమనార్హం. దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ జెఎన్ 1 కేసులు పెరుగుతున్నాయి. కేరళలో మొదలైన ఈ ఉధృతి అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

దీంతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా ఉన్న యాక్టివ్ కేసులు 22 కాగా వీరిలో 1 రికవరీ అయినట్లు తాజా బులిటెన్లో వైద్యశాఖ తెలిపింది. తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజు 1245మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. ఈ టెస్టుల్లో మొత్తం 9 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వీరిలో 8 మంది హైదరాబాద్ కు చెందినవారు ఉండగా ఒకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ఉన్నారని సమాచారం.

ఇది కూడా చదవండి: దొంగ మాటలు చెప్పి గెలిచిండు

Latest News

More Articles