Friday, May 17, 2024

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!

spot_img

తెలంగాణలో బోగస్ రేషన్ కార్డులు తొలగించడమే లక్ష్యంగా రాష్ట్రమంతా రేషన్ ఈ కేవైసీ ప్రక్రియను షురూ చేసింది సర్కార్. కొద్ది నెలల క్రితం రేషన్ కార్డు ఈ ప్రక్రియ మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు. దీంతో రేషన్ కార్డుదారులు అన్నిచోట్ల రేషన్ షాపులకు వెళ్లి వేలిముద్రలు ఇచ్చి బయోమెట్రిక్ పూర్తి చేస్తున్నారు. కుటుంబమంతా కూడారేషన్ దుకాణాలకు వెళ్లి వేలిముద్రలు ఇచ్చేసి వస్తున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం లబ్దిదారుల్లో 74శాతం మంది మాత్రమే ఈ కేవైసీపూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 26శాతం మంది వేలిముద్రలు ఇచ్చి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రజలు ఎలాంటి గందరగోళం, హడావిడి లేకుండా ప్రశాంతంగా కేవైసీపూర్తి చేసుకోవాలని చెబుతూ వచ్చిన పౌరసరఫరాల శాఖ అధికారులు..ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. వీలైనంత తర్వాగా మిగిలిన 26శాతం మంది బయోమెట్రిక్ ఫినిష్ చేయాలని రేషన్ షాపులకు అధికారులు ఆదేశాలు ఇచ్చారనితెలుస్తోంది.

రేషన్ కార్డుల్లో ఉన్న అవకతవకలు, కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల కీలక సమాచారం సేకరించిపారదర్శకంగా రేషన్ దరఖాస్తు చేయడంలో భాగంగా ఈ కేవైసీనమోదు కార్యక్రమాన్ని చేటప్టారు. దీనిలో భాగంగానే బోగస్ కార్డులను వెలికి తీయనున్నారు. కేవైసీ పూర్తి చేయనివారి రేషన్ కార్డు తొలగించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: పెళ్లి అంటే గానభజాన అనుకున్నారా? ఏడడుగులు నడవాల్సిందే:సుప్రీం

Latest News

More Articles