Friday, May 17, 2024

చైనాలో భారీ వర్షాలు..కూలిన హైవే..36 మంది దుర్మరణం.!

spot_img

దక్షిణ చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆకస్మాత్తుగా హైవే కుప్పకూలింది. దీంతో వేగంగా వస్తున్న అనేక కార్లు గోతిలో పడిపోవడంతో 36 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు హైవే 17.9 మీటర్ల భాగం కుప్పకూలిందని, 23 వాహనాలు గొయ్యిలోకి వెళ్లాయని మీజౌ నగర పరిపాలన తెలిపింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలు గత 2 వారాలుగా వర్షం,వరదలతో పాటు వడగళ్ల వాన బీభత్సం స్రుష్టిస్తోంది.

గత వారం చివరిలో, ప్రావిన్షియల్ రాజధాని గ్వాంగ్‌జౌలో తుఫానులో 5 మంది మరణించారు. నివేదికల ప్రకారం, వర్షం కారణంగా, రహదారికి దిగువన ఉన్న భూమి లోపలికి గుచ్చుకుంది. దీంతో రహదారిలో కొంత భాగం కూడా గుంటకు గురైంది. పెద్ద శబ్ధం వినిపించిందని, ఆ తర్వాత అక్కడ పెద్ద బిలం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు. స్థానిక మీడియాలో విడుదలైన వీడియోలు, చిత్రాలలో, సంఘటన స్థలంలో పొగ, మంటలు కనిపించాయి. అంతకుముందు శనివారం, ఒక రోజు ముందు గ్వాంగ్‌జౌలో ఒక భాగాన్ని తాకిన తుఫాను భారీవినాశనం కలిగించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. తుపాను కారణంగా 140కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. చైనా ప్రభుత్వ మీడియాలో విడుదలైన చిత్రాలను చూస్తే విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. తుఫాను కారణంగా 33 మంది గాయపడటంతోపాటు.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇది కూడా చదవండి: పసిడి పతనం..రూ.2,700తగ్గిన బంగారం ధర.!

Latest News

More Articles