Friday, May 17, 2024

పసిడి పతనం..రూ.2,700తగ్గిన బంగారం ధర.!

spot_img

బంగారం కొనాలనుకుంటున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. బంగారం కొనాలని భావించేవారికి ఇది ఊరట కలిగించే అంశం. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. బంగారం, వెండి ధరలు తగ్గుదల వల్ల కొనుగోలు చేయాలని భావించే వారికి ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

దేశంలో బంగారం ధరలు తగ్గుతుండటం వల్ల మన రాష్ట్రంలో కూడా దిగివచ్చాయి. బంగారం కొనేవారికి ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు. బంగారం ధర గత 10 రోజులుగా చూస్తే భారీగా తగ్గిందనే చెప్పవచ్చు. వెండి రేటు కూడా అదే స్థాయిలో దిగివస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఏప్రిల్ 21న బంగారం ధర రూ. 74,240గా ఉంది. 24 క్యారెట్ల బంగారానికి ఈ ధర వర్తిస్తుంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు చూస్తే మే 2న రూ. 71,500 వద్ద ఉంది. అంటే బంగారం ధరరూ. 2,700 పైగా దిగివచ్చిందని చెప్పవచ్చు.

ఇక 22క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధరను గమనిస్తే..ఈ రేటు ప్రస్తుతం మే 2న రూ. 65,540 వద్ద ఉంది. కానీ ఏప్రిల్ 21న చూస్తే ఈ బంగారం ధర రూ. 68,050వద్ద ఉంది. ఈ బంగారం ధర ఈ కాలంలో రూ. 2,500 వరకు పడిపోయిందని చెప్పవచ్చు. వెండి ధర చూస్తే కూడా తగ్గుతూ వస్తోంది. వెండి ధరకూడా ఇదే కాలంలో భారీగా తగ్గుముఖం పట్టింది. వెండి ధర ఏప్రిల్ 21న రూ. 90వేల వద్ద ఉంది. ఇప్పుడు రూ. 86,400 వద్ద ఉంది. వెండి రేటు రూ 3వేలు పతనం అయ్యింది.

ఇది కూడా చదవండి: కామెడీ కాదు..నిజమే..మోదీపై కమెడియన్ పోటీ.!

Latest News

More Articles