Sunday, May 19, 2024

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయలేమా ?

spot_img

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ అభ్యర్థులని గవర్నర్ ఎన్నుకోవటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందాల ప్రకారమే గవర్నర్ సహకరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకి గవర్నర్ తమిళిసై అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ జాబితాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాసోజ్ శ్రవణ్ తో పాటు సత్యనారాయణ పేరుని గవర్నర్ కి ప్రతిపాడించారు. అయితే వీరిద్దరి పేర్లని తిరస్కరించి.. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లని ఎన్నుకుంది గవర్నర్.

ఈ ఉదంతంపై సత్యనారాయణ స్పందిస్తూ.. రాజకీయ నాయకుడినని నా పేరును తిరస్కరించిన గవర్నర్ ఓ పార్టి అధ్యక్షుడు అయిన కోదండరాంకు ఎలా ఓకే చేస్తారు. మేము గవర్నర్ నిర్ణయం మీద కేసు వేసినపుడు కోదండరాం పేరు ఎమ్మెల్సీకి పంపలేదు. తెలంగాణ జన సమితి కేసీఆర్ ను ఎందుకు తప్పు బడుతోంది ? కేసీఆర్ దిష్టి బొమ్మల దహనానికి ఎందుకు పిలుపు నిచ్చారు ? మేము సీఎం దిష్టి బొమ్మలు కాల్చలేమా ? కాంగ్రెస్ కు ఎరుకల కులానికి ఎమ్మెల్సీ ఇచ్చే దైర్యం ఉందా ? నా పేరు గవర్నర్ తిరస్కరించినపుడు ఇంకో ఎరుకల కులస్థుడిని రేవంత్ ఎమ్మెల్సీ కి నామినేట్ ఎందుకు చేయలేదు. రేవంత్ మాట్లాడేటపుడు తాను సీఎం ననే విషయం మరచిపోవద్దు. చిన్న కులాల నేతలను విమర్శించేపుడు సీఎం సంయమనం పాటించాలి అని అన్నారు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ.

Latest News

More Articles