Friday, May 17, 2024

పండ‌రీపుర్ ఆల‌యాన్ని దర్శించుకున్న కేసీఆర్

spot_img

తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌హారాష్ట్ర‌లోని పండ‌రీపుర్ ఆల‌యానికి చేరుకున్నారు. శ్రీ విట్టల్‌ రుక్మిణి ఆల‌యాన్ని ద‌ర్శించుకొని దేవ‌త‌ల ఆశీస్సులు తీసుకున్నారు. దేశ‌వ్యాప్తంగా రైతులంతా క్షేమంగా ఉండాల‌ని ఆయ‌న ప్రార్ధించారు. సోమవారం హైద‌రాబాద్ నుంచి భారీ ర్యాలీగా బ‌య‌లుదేరిన వెళ్లిన ఆయ‌న‌ సోమ‌వారం రాత్రి సోలాపూర్‌లో బ‌స చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల‌తో కలిసి ఆయ‌న ఆల‌యాన్ని సంద‌ర్శించారు. సీఎం కేసీఆర్ ఆలయానికి వచ్చిన సందర్భంగా అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఉత్తరద్వారం గుండా కేసీఆర్‌ ఆలయం లోపలికి వెళ్లారు. దుకాణ సముదాయాల మధ్య నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు సీఎం కేసీఆర్‌కు శ్రీవిట్టల్‌ రుక్మిణి ప్రతిమను బహూకరించాడు.

కాగా.. ప్ర‌త్యేక పూజ‌ల త‌ర్వాత స‌మీపంలోని సర్కోలి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. అక్కడ పార్టీ కార్య‌కర్త‌ల‌తో స‌మావేశం నిర్వహిస్తారు. స్థానిక నేత‌లు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్నారు. అనంతరం గ్రామ నాయకుడు భగీరత్ బాల్కే ఆహ్వానం మేరకు ఆయన నివాసంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మధ్యాహ్నం భోజనం చేయనుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మూడు గంట‌ల‌కు తుల్జాపూర్ భ‌వాన్ని ఆల‌యాన్ని ద‌ర్శిస్తారు.

క్రీ.పూ. 1108-1158 మ‌ధ్య కాలం అప్ప‌టి చ‌క్ర‌వ‌ర్తి విఠ‌లేశ్వ‌ర ఆల‌యాన్ని నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఆషాడ మాసం వేళ .. తొలి ఏకాద‌శి రోజున ఇక్క‌డ పెద్ద ఎత్తున పండుగ నిర్వ‌హించి, స్థానిక భ‌క్తులు పాద‌యాత్ర చేస్తారు. ఆ పాద‌యాత్ర‌ను వార్కా అంటారు. వారీనే వార్క‌ర్లు అంటారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న ప్ర‌త్యేక‌త సంత‌రించుకున్న‌ది.

Latest News

More Articles