Monday, May 13, 2024

సందీప్ రెడ్డిపై దౌర్జన్యం.. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనం

spot_img

హైదరాబాద్: తమపార్టీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోలీసులతో నెట్టివేయటాన్ని తీవ్రంగా తప్పపట్టారు బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనం అని అన్నారు. ఓడిపోయిన నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

మంత్రుల్ని ప్రశ్నిస్తే పోలీసుల్ని రెచ్చగొట్టి నెట్టివేయిస్తున్నారు. మంత్రులు అధికారమదంతో  వ్యవహరిస్తున్నారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై వెంటనే చర్యలు  తీసుకోవాలి. మంత్రులు ఈ రకంగా వ్యవహరించటం సిగ్గు చేటు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Also Read.. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని అవమానించిన మంత్రి కోమటిరెడ్డి..బచ్చా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Latest News

More Articles