Tuesday, May 14, 2024

నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో

spot_img

నల్లగొండ : సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగార్జునసాగర్ ఎడమ కాలువ సూరేపల్లి మేజర్ వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడమ కాల్వ కింద రైతులు 30 శాతం మంది వరి పంటలు వేశారన్నారు. నేడు అవి ఎండిపోయే దశలో ఉన్నాయన్నారు. నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రాజెక్టులో నీళ్లు లేకపోతే కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించి ఆల్మట్టి నుంచి నీళ్లను తీసుకొచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.

Also Read.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం

Latest News

More Articles