Saturday, May 18, 2024

జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని అవమానించిన మంత్రి కోమటిరెడ్డి..బచ్చా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

spot_img

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. ఆధికార కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ ను ఘోరంగా అవమానించారు. సాక్షత్తూ మంత్రి హోదాలోనే కోమటిరెడ్డి ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు జెడ్పి చైర్మన్ ను అడ్డుకోవడంతోపాటు తోసివేసే ప్రయత్నం చేయడం కలకలం సృష్టించింది.

భువనగిరి (మం) గూడూరు గ్రామంలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలుత మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  అనంతరం జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. గతంలో రైతుబంధు అడిగిన వారిని చెప్పుతో కొట్టాలని అనడం సరైనది కాదని కౌంటర్ ఇచ్చాడు. హూందాగా ప్రవర్థించాల్సిన మంత్రి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

సందీప్‌ రెడ్డి మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి మధ్యలో జోక్యం చేసుకున్నారు. మాధవరెడ్డి ఒక మహా నాయకుడు.. ఆయన కడుపులో పుట్టిన సందీప్ రెడ్డి ఒక బచ్చా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కనీసం వార్డ్ మెంబర్ గెలిచే స్థాయిలో కూడా ఆయన లేడని వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇంతలోనే కాంగ్రెస్ శ్రేణులు స్టేజీపైకి వచ్చి హంగామా సృష్టించారు. సందిప్ ను తోసివేసే ప్రయత్నం చేశారు. ఇదంతా మంత్రి ఎదుటే జరుగుతున్నా.. ఆపాల్సిన చోటే ఆయనే అహంకారంతో వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సందీప్ రెడ్డిని ఇక్కడి నుండి పంపించాలని పోలీసులకు మంత్రి ఆదేశించారు.  అనంతరం పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు సందిప్ ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. బీఆర్ఎస్ నేతలు జడ్పీ చైర్మన్ ను సమావేశం నుండి బయలకు తీసుకుపోయారు.

Also Read.. ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడి అక్రమ అరెస్ట్.. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సీరియస్

Latest News

More Articles