Saturday, May 11, 2024

ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడి అక్రమ అరెస్ట్.. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సీరియస్

spot_img

ఖమ్మం లోని జిల్లా కారాగారంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును జైల్లో పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్. భూ క్రమబద్ధీకరణ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ లో ఉన్నారు నాగరాజు. మధుసూదన్ వెంట మేయర్ నీరజ, డిసిసిబి చైర్మన్ నాగభూషణం, బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగరాజును జైల్లో పరామర్శించిన అనంతరం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ..

‘పగడాల నాగరాజు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే. ఒకరిద్దరు నాయకులను అరెస్టు చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయాందోళనకు గురిచేయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు, అరెస్టులు, జైళ్లు కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ఏ తప్పులైతో చేసిందని అప్పుడు కాంగ్రెస్ నాయకులు విమర్శించారో, ఇప్పుడు జిల్లాలో ఉన్న మంత్రులు అదే పని చేస్తున్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కార్యకర్తలకు,నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.

Latest News

More Articles