Sunday, April 28, 2024

పార్లమెంట్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్

spot_img

హన్మకొండలోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. జయమైనా అజయమైనా సమానంగా తీసుకోవాలి. 40 ఏళ్లలో కాంగ్రెస్ 15 ఏళ్లే అధికారంలో ఉంది. ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించామో ఆ లక్ష్యాలను సాధించాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విష ప్రచారం చేసింది. బీఆర్ఎస్ కేవలం 1.85 శాతం ఓట్లతో ఓడిపోయింది. ఫలితాలతో నిరుత్సాహ పడొద్దు.. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కావాలి.

పార్లమెంట్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడం ఖాయం. శ్రేణులు కదనోత్సాహంతో ఉంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 50 ఏళ్లలో దక్షిణ భారత దేశంలో ఏ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి రాలేదు. దక్షిణ భారత దేశ చైతన్యం వేరు. ఒడిషా కంటే తెలంగాణ అభివృద్ధిలో ఎంతో ముందు ఉంది. పని చేయక ఓడిపోలేదు. రాష్ట్రం తెచ్చిన కేసిఆర్ తెలంగాణను ఎంతో వేగంగా అభివృద్ధి చేశారు.. ఆశించిన దానికన్నా వంద రెట్లు ఎక్కువ పనులు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,60,063 ఉద్యోగాలు ఇచ్చాం.. మిగతావి ప్రాసెస్ లో ఉన్నాయి. దేశంలోనే తెలంగాణలో అత్యధిక జీతాలు ఇచ్చాం’ అని అన్నారు నిరంజన్ రెడ్డి.

Latest News

More Articles