Sunday, May 12, 2024

జీవితాన్ని నాశనం చేశావ్.. షోయబ్ మూడవ భార్యపై దారుణ ట్రోలింగ్

spot_img

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి విడాకుల ఇచ్చి నటి సనా జావేద్‌ ని వివాహం చేసుకున్న తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ వార్తల్లో నిలిచాడు. సానియా షోయబ్ విడాకులు పాకిస్తాన్, భారతదేశంలో ప్రకంపనలు సృష్టించాయి. షోయబ్ మాలిక్ తన కొత్త భార్యతో ఉన్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. సానియా మీర్జా కుటుంబం విడాకులని ధ్రువీకరించింది. అయితే తాజాగా షోయబ్ మూడవ భార్య సనాపై దారుణ ట్రోలింగ్ జరుగుతుంది. శనివారం తన వివాహం తర్వాత సోషల్ మీడియాలో తన మొదటి సోలో చిత్రాన్ని పోస్ట్ చేసింది సన జావేద్. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన దీనిపై భారీగా ట్రోలింగ్ నడుస్తుంది.

ద్వంద్వ ముఖాల మనుషులని ఒకరు, ఇకపై నీ షోలు చూడబోనని మరొకరు కామెంట్లు చేస్తే.. అన్యాయంగా ఓ ఇంట్లో నిప్పులు పోశావని ఇంకొకరు దుమ్మెత్తి పోశారు. ఒక మహిళ మరో మహిళ కుటుంబాన్ని విడదీసిందని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వివాహం సరికాదని ఇంకో యూజర్ కామెంట్ చేస్తే, మీకోసం వేలాది తిట్లు రెడీగా ఉన్నాయని మరికొందరు యూజర్లు దుమ్మెత్తి పోశారు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా లైకులు సంపాదించుకున్న ఈ పోస్టుకు ట్రోల్స్ వెంటాడుతున్నాయి.

Latest News

More Articles