Monday, May 20, 2024

ఐక్యరాజ్య సమితిలో అయోధ్య వివాదం.. మరోసారి బరితెగించిన పాకిస్తాన్..!

spot_img

అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం చూసి పరవశించిపోతున్నారు. రామనామస్మరణతో భారతీయులంతా ఈ కార్యక్రమాన్ని పండుగల చేసుకున్నారు. దీన్ని చూసిన శత్రుదేశం పాకిస్తాన్ అక్కస్సు వెళ్లగక్కింది. భారత్, భారతీయుల ఆనందాన్ని పాకిస్థాన్ భరించలేకపోతోంది. దీంతో అయోధ్యపై ఫిర్యాదు చేయడానికి పాకిస్తాన్ అధికారికంగా ఐక్యరాజ్యసమితికి (UN) లేఖ రాసింది. శ్రీరాముని పవిత్రోత్సవంలో ముస్లింలు కూడా పాల్గొన్న విషయం మరిచి పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. అయోధ్యలో రామ మందిరాన్ని అంతకుముందు ఉన్న బాబ్రీ మసీదును కూలగొట్టి కట్టారని.. దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించి.. ప్రాణ ప్రతిష్ఠ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి పంపిన లేఖలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ పేర్కొన్నారు. ఇలాంటి వైఖరి భారత్‍‌లోని ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం, శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని మునీర్ అక్రమ్ ఆ లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణను నిర్ధారించేందుకు భారత్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Latest News

More Articles