Saturday, May 18, 2024

అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ.. మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌

spot_img

శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఇవాళ (శుక్రవారం) కులగణన తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు తెలిపింది. తీర్మానంపై బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడారు. కులగణన పకడ్బంధీగా నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గంగుల సూచించారు. అదేవిధంగా కులగణనపై తీర్మానం మాత్రమే కాదు చట్టం చేస్తే బాగుంటుందని అన్నారు.

భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని, ఎలాంటి కోర్టు కేసులకు అవకాశం ఉండకూడదని గంగుల సూచించారు. కులగణన పూర్తి అయిన వెంటనే చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో ముందే చెప్పాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు.

ఎంబీసీలను మొదటి గుర్తించినదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని గంగుల చెప్పారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. బీసీ సబ్‌ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీహార్ లో ఇప్పిటికే కులగణన చేశారని, కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని గంగుల గుర్తుచేశారు.

 ఇది కూడా చదవండి: కెన‌డాలో గుండెపోటుతో హైద‌రాబాదీ విద్యార్థి మృతి

Latest News

More Articles