Saturday, May 4, 2024

పేటీఎంకు బిగ్ షాక్:  ఫాస్టాగ్ సేవల జారీ నిలిపివేత

spot_img

ఇప్పటికే ఆర్‌బీఐ ఆంక్షలతో ఇబ్బందుల్లో ఉన్న డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు తాజాగా ఎన్‌హెచ్ఏఐ షాక్ ఇచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) ఫాస్టాగ్ సేవల కోసం అనుమతిచ్చిన 30 ఆథరైజ్‌డ్ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీపై నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.

ఫాస్టాగ్ యూజర్లు టోల్ ఫీజున చెల్లించేందుకు, ఇబ్బందులు పడకుండా ప్రయాణించేందుకు తాము  తెలిపిన బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలని ఎన్‌హెచ్ఏఐ తరపున టోల్ ఫీజు వసూలు చేస్తున్న ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) చెప్పింది. ఐహెచ్ఎంసీఎల్ తెలిపిన లిస్టులో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‌బీఐ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. ఇందులోంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి సంచలనం కోసం ఏదో ఒకటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు

Latest News

More Articles