Sunday, June 16, 2024

బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య..గొడ్డలితో తల నరికి.!

spot_img

వనపర్తి జిల్లాలో ఘోరం జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బుధవారం అర్థరాత్రి ఈఘటన జరిగింది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తున్న శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో తల నరికి దారుణంగా హతమార్చారు.

మృతుడు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. హత్యపై హర్షవర్ధన్ రెడ్డి ఇప్పటివరకు స్పందించారు. రాజకీయ కక్ష్యతోనే శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు.

ఈమధ్యే బీఆర్ఎస్ మద్దతుదారులపై వరసగా దాడులు జరుగుతున్నాయన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: ఆర్సీబీ కథ ముగిసింది..ఎలిమినేటర్​లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ.!

Latest News

More Articles