Sunday, June 16, 2024

కొండగట్టులో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు.!

spot_img

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం ఉదయం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు వెంట సుంకె రవిశంకర్ తోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న హరీశ్ రావుకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్థతిలో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వేదమంత్రాలతో హరీశ్ రావును ఆశీర్వదించారు ఆలయ అర్చకులు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య..గొడ్డలితో తల నరికి.!

Latest News

More Articles