Friday, May 17, 2024

హైటెక్ సిటీ తరహాలో.. ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి..!

spot_img

ఖమ్మం నగరం 17వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలవకట్టపై నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన GO.No.58&59 ద్వారా మంజూరైన పట్టాలను అందజేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో 2800 మందికి ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి అక్కడే స్థిర నివాసం ఉండేందుకు హక్కు పత్రాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ గారిది. ఒకప్పుటి ఖమ్మం, నేటి ఖమ్మం ఎలా ఉంది.

కనీసం ప్రయాణించడానికి రోడ్లు సరిగా లేక, విద్యుత్, త్రాగునీరు లేక, అధ్వానంగా ఉండేది. ఇప్పుడు అన్ని సదుపాయాలు కల్పించాం. ఖమ్మం నగరంలో హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో రూ.180 కోట్లతో నగరంలో మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి త్వరలో కట్టుకోబోతున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న BRS ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలని, మళ్ళీ ముఖ్యమంత్రి గా కేసీఅర్ గారినే గెలిపించుకోవాలి’ అని పేర్కొన్నారు మంత్రి పువ్వాడ.

Latest News

More Articles